39శాతం ఓట్లతో తీన్మార్ మల్లన్న ముందంజ

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14641 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.

Update: 2024-06-06 05:15 GMT

దిశ, నల్లగొండ బ్యూరో : వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14641 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.. కౌంటింగ్ నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇంకా కొనసాగుతుంది.

మొదటి రౌండ్‌లో..

మొత్తం 96, 097 ఓట్లు లెక్కించగా అందులో చెల్లిన ఓట్లు 88369 , చెల్లని ఓట్లు7728 ఉన్నాయి. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 36,210,( 40.9శాతం) టిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 28540,(32.29శాతం), బీజెపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి 11395( 12.89శాతం) ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ కు 9109 ఓట్లు లభించాయి. ఈ మొదటి రౌండులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 7670 ఓట్లు ఆదిక్యత లభించింది.

రెండవ రౌండ్ ఓట్లు లెక్కింపు..

ఎన్నికల అధికారులు రెండవ రౌండ్ అధికారికంగా ప్రకటించారు. రెండవ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు 34 575 (38.9శాతం) టిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 27573,(28.7శాతం) బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 12844( 14.6శాతం)ఓట్లు దక్కాయి. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ 9306 ఓట్లు లభించినట్లు అధికారులు ప్రకటించారు.

మొత్తంగా రెండు రౌండ్‌లు కలిపి..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు 70,785, (39శాతం) , బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 56,114 ( 31.6శాతం) ఓట్లు, బిజెపి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 24,239( 13శాతం) ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ 20,324 ఓట్లు సాధించారు.ఇప్పటివరకు 1 , 92 , 277ఓట్లు మొదటి ప్రాధాన్యతలో లెక్కించారు.అందులో చెల్లిన ఓట్లు 1,77,151 ఉన్నాయి. చెల్లని ఓట్లు సుమారు 15126 ఓట్లు పడ్డాయి.


Similar News