Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిలు మంజూరు
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ముగ్గురు నిందితుల(Three Accused)కు నాంపల్లి కోర్టు(Nampally Court) బెయిలు మంజూరు(Grants Bail)చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ముగ్గురు నిందితుల(Three Accused)కు నాంపల్లి కోర్టు(Nampally Court) బెయిలు మంజూరు(Grants Bail)చేసింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములలకు కోర్టు బెయిల్ ఇచ్చింది. 20వేల పూచికత్తు, రెండు షూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ కేసులో నిన్న హైకోర్టు ఇచ్చిన మద్యంతర స్టే ఉత్తర్వులను నాంపల్లి కోర్టుకు నిందితుల తరపు న్యాయవాది లక్ష్మణ్ సమర్పించారు. దీంతో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పంజాగుట్ట ఫోన్ ట్యాపింగ్ కేసులో మార్చి 3 వరకు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. మాజీ మంత్రి టి.హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులు తన ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో హరీష్ రావు వద్ధ పనిచేసిన వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఓ రైతు డాక్యుమెంట్లతో సిమ్ కార్డు కొనుగోలు చేసి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్ చేసి డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో హరీష్ రావును ఏ 1గా, రాధాకిషన్ రావును ఏ2గా పోలీసులు పేర్కొన్నారు. తనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును క్వాష్ చేయాలని హరీశ్ రావు, రాధాకిషన్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో హరీశ్ రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బుధవారం జరిగిన విచారణలో జస్టీస్ లక్ష్మణ్ పీపీ అభ్యర్థన మేరకు విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటివరకు కేసు దర్యాప్తును నిలిపివేయాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కేసులోని ముగ్గురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read More..
Komatireddy: హరీశ్ రావు మనిషివేనా?..రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు