ధరణితో వేల అప్లికేషన్లు పెండింగ్
ధరణితో వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణితో వేల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని ధరణితో వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్పేర్కొన్నారు. సీఎస్, సీఎం దృష్టికి సమస్యలు వెళ్లినా పరిష్కారం కావట్లేదన్నారు. దీంతోనే ధరణి ఇష్యూలపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశామన్నారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాంగ్రెస్అధికారంలోకి రాగానే ధరణిని రద్ధు చేస్తామన్నారు.కాంగ్రెస్ భూములు పంచితే.. బీఆర్ఎస్వాటిని ఆక్రమిస్తుందని ఆరోపించారు. భూదాన్భూములను హెచ్ఎండీఏ అమ్ముకుంటుందన్నారు. ధరణి తో ఇబ్బంది పడుతున్న వారంతా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మెళనాలలో నిలదీయాలన్నారు. రైతులను ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం మానవ హక్కుల ఉల్లంఘనే అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.నిజమైన హక్కు దారులలో చాలా మందికి ధరణి లో లబ్ది జరగలేదన్నారు. సమస్య ఉందని తెలిసినా ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్నారు. త్వరలోనే ధరణిపై కాంగ్రెస్పార్టీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందన్నారు.