ఆర్టీసీ బిల్లులో ఆ అంశాలేవి.. ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్

టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై సందేహాలు వ్యక్తం చేశారు.

Update: 2023-08-05 05:08 GMT
ఆర్టీసీ బిల్లులో ఆ అంశాలేవి.. ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గవర్నర్ లేఖ రాశారు. ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, లోన్లు గురించి వివరాలు లేవని గవర్నర్ తెలిపారు. విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు బిల్లులో లేవని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఆర్టీసీ బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముసాయిదాను గవర్నర్ కు పంపగా ఇప్పటి వరకు అనుమతి రాని విషయం తెలిసిందే. 

Read More:   RTC యూనియన్ నేతలకు గవర్నర్ పిలుపు

Tags:    

Similar News