ధరణి పోతే జరిగేది ఇదే..! : భువనగిరి సభలో CM KCR

ధరణి వల్ల భూములు లాక్కునే పరిస్థితులు లేవని సీఎం కేసీఆర్ అన్నారు.

Update: 2023-10-16 12:18 GMT
ధరణి పోతే జరిగేది ఇదే..! : భువనగిరి సభలో  CM KCR
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ధరణి వల్ల భూములు లాక్కునే పరిస్థితులు లేవని సీఎం కేసీఆర్ అన్నారు. భువనగిరి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. భువనగిరిలో అద్భుతమైన పంటలు పండుతున్నాయన్నారు. ధరణి పోతే రైతులపై రాబంధులు పడుతారన్నారు. ఇక్కడి ప్రజల పోరాట ఫలితమే యదాద్రి భువనగిరి జిల్లా అన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ అరాచక శక్తులను పెంచి పోషించిందన్నారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. అనేక రంగాల్లో తెలంగాణ టాప్‌లో ఉందన్నారు. భువనగిరిలో స్పెషల్ ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు మూడు గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుందని అంటున్నారని పరోక్షంగా కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. మన ప్రగతికి ఏది మంచో ఏది చెడో ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు.

Tags:    

Similar News