రెగ్యూలరైన కాంట్రాక్టు ఉద్యోగుల లిస్టు ఇదే..!
తెలంగాణ నూతన సచివాలయాలన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం(ఏప్రిల్ 30) మధ్యాహ్నం గ్రాండ్‌గా ప్రారంభించారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయాలన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం(ఏప్రిల్ 30) మధ్యాహ్నం గ్రాండ్‌గా ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలోని ఆయన చాంబర్‌లోకి వెళ్లి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలుపై సంతకం చేశారు. మొత్తం 20 విభాగాల్లోని 5,544 కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఇందులో 2,909 మంది జూనియర్ లెక్చరర్లు, 184 మంది జూనియర్ లెక్చరర్లు(ఒకేషనల్), 270 మంది డిగ్రీ లెక్చరర్లు, సాంకేతిక విద్యా శాఖలో 131 మంది అటెండర్లు, 390 పాలిటెక్నిక్ లెక్చరర్లు, వైద్య శాఖలోని 837 మంది వైద్య సహాయకులు, 179 మంది ల్యాబ్ టెక్నిషియన్లు, 158 మంది ఫార్మసిస్టులు, 230 మంది సహాయ శిక్షణ అధికారులు కూడా ఉన్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
Read more:
కొత్త సెక్రటేరియట్‌లో మీడియాపై ఆంక్షలు.. ఇకనుంచి ప్రెస్మీట్లన్నీ అక్కడే!
కొత్త సెక్రటేరియట్‌లో సీఎం కేసీఆర్ సంతకాలు చేసిన ఫైళ్ళు ఇవే!