"అర బుర్ర" అనే వారి అభిప్రాయాన్ని నిజం చేస్తున్నారు!.. కేటీఆర్ ట్వీట్ కు టీ కాంగ్రెస్ కౌంటర్
కేటీఆర్ గారూ.. సుప్రీం తీర్పులో అసలు విషయాన్ని దాచేసి, అర బుర్ర అని మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న వారి అభిప్రాయాన్ని నిజం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ విమర్శించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: కేటీఆర్ గారూ.. సుప్రీం తీర్పులో అసలు విషయాన్ని దాచేసి, అర బుర్ర అని మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న వారి అభిప్రాయాన్ని నిజం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ విమర్శించింది. కేసీఆర్ కేసు విషయంలో తీర్పుపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ కు టి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఈ సందర్భంగా కేటీఆర్ గారూ.. ఫేక్ ప్రచారాలు చేయడంలో మీరు గోబెల్ ను మించి పోయారని, ఆ విషయంలో మీరు “ఒక వర్గానికి” ఇన్స్పిరేషన్ అని విమర్శలు చేసింది. అలాగే సుప్రీం తీర్పులో అసలు విషయాన్ని ఉద్దేశపూర్వకంగా దాచేసి మీరు “దోచేసిన” దానిపై విచారణ ఖాయమన్న విషయాన్ని వదిలేశారని ఆరోపించింది.
ఈ విషయంలో “అర బుర్ర” అని మిమ్మల్ని ట్రోల్ చేసే వారి అభిప్రాయాన్ని నిజం చేస్తున్నారు! అని సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపింది. ఆ విషయాన్ని దాచేస్తే ఎట్లా!! అంటూ.. విచారణ ఆగదు, నిజం నిగ్గు తేలకుండా ఉండదని ఎక్స్ ద్వారా తెలిపింది. కాగా విద్యుత్ కమీషన్ రద్దు కోరుతూ కేసీఆర్ వేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కేటీఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. కాంగ్రెస్ పై పలు విమర్శులు చేశారు.