దోపిడీ దొంగల హల్‌చల్.. నడిరోడ్డుమీద బస్సు ఆపి రూ.10 లక్షలు చోరీ

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

Update: 2023-02-24 11:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శివరాంపల్లి వద్ద ఇద్దరు గుర్తు తెలియని దుండగులు నడిరోడ్డుమీద ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న నగల వ్యాపారి శివను కత్తితో బెదిరించి నగదు సంచిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వ్యాపారి కళ్లలో కారం చల్లి అక్కడినుంచి పరారయ్యారు. ఆర్టీసీ బస్సు నారాయణపేట్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అటునుంచి నేరుగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన శివ వారిపై ఫిర్యాదు చేశారు. నగల సంచిలో రూ.10 లక్షల నగదు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News