ఒక్కసారిగా మారిన హైదరాబాద్ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం

గత పది రోజులుగా వేసవి తాపం తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు కాస్త ఊరట లభించింది.

Update: 2024-05-07 11:59 GMT
ఒక్కసారిగా మారిన హైదరాబాద్ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గత పది రోజులుగా వేసవి తాపం తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులకు కాస్త ఊరట లభించింది. మంగళవారం సాయంత్రం 4 తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా వడగండ్ల వర్షాలు కురిశాయి. సాయంత్రం కోపంల్లి, సుచిత్ర, శేరిలింగంపల్లి, జీడిమెట్ల, కొండాపూర్ లో వానలు కురిశాయి. అలాగే మియాపూర్ వడగండ్ల వర్షం పడింది. ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే భారీ గాలులకు కాంగ్రెస్ సభ స్థలం అల్లకల్లోలం అయింది.


Read More...

హైదరాబాద్‌లో భారీ వర్షం.. అతలాకుతలం అవుతున్న పట్టణం (వీడియో) 


Similar News