Raja Singh : భారీగా పెరిగిన రాజాసింగ్ ఆస్తులు.. ఇప్పుడు ఎంతో తెలుసా..?

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో అభ్యర్థులందరూ

Update: 2023-11-05 05:27 GMT
Raja Singh : భారీగా పెరిగిన రాజాసింగ్ ఆస్తులు.. ఇప్పుడు ఎంతో తెలుసా..?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీంతో అభ్యర్థులందరూ నామినేషన్లు వేస్తోన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ తరపున నామినేషన్ వేయగా.. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ సమర్పించారు. ఈ అఫిడవిట్ ప్రకారం రాజాసింగ్ ఆస్తులు గత ఎన్నికలతో పోలిస్తే భారీగా పెరిగాయి. 2018 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రాజాసింగ్ చరాస్తుల విలువ రూ.87 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.2.29 కోట్లకు పెరిగాయి.

ఇక 2018 ఎన్నికల్లో రాజాసింగ్ సతీమణి చరాస్తుల విలువ రూ.14.29 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.34.70 లక్షలకు పెరిగాయి. ఇక 2018 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రాజాసింగ్ చేతిలో రూ.2 లక్షల నగదు, బ్యాంకులో రూ.60 లక్షలు, 50 గ్రాముల బంగారం ఉంది. అటు 2014 ఎన్నికల సమయంలో చేతిలో రూ.1.50 లక్షలు, 10 గ్రాముల బంగారం ఉన్నట్లు రాజాసింగ్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News