సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఉదంతంలో కీలక మలుపు
సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఉదంతం సరికొత్త మలుపు తిరిగింది. ప్రమాదం జరిగిన ఇంట్లో నుంచి పోలీసులు కోటీ 64 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఉదంతం సరికొత్త మలుపు తిరిగింది. ప్రమాదం జరిగిన ఇంట్లో నుంచి పోలీసులు కోటీ 64 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రముఖ కంపెనీలో డీజీఎంగా పని చేస్తున్న శ్రీనివాస్ రెజిమెంటల్ బజార్‌లో నివాసముంటున్నాడు. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు గోపాలాపురం పోలీసులు అక్కడికి వెళ్లారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చిన తర్వాత ఇంటి లోపలికి వెళ్లారు. అప్పటికే అక్కడికి వచ్చిన శ్రీనివాస్ బంధువులు బెడ్ రూంలో ఉన్న బీరువాలో నగదు సురక్షితంగా ఉందా? అని చూడటానికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీ జరుపగా కోటీ 64 లక్షల నగదు, వెండి, బంగారు నగలు కనిపించాయి. పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Also Read..