పోలీసులు భక్షకులుకాదు రక్షకులే.. వారెవ్వా ఇది కదా మానవత్వం అంటే..
పోలీసు అంటే రక్షకులు కారు భక్షకులు అనే అభిప్రాయం చాలంది ప్రజల్లో నాటుకుపోయింది.
దిశ వెబ్ డెస్క్: పోలీసు అంటే రక్షకులు కారు భక్షకులు అనే అభిప్రాయం చాలామంది ప్రజల్లో నాటుకుపోయింది. అయితే పోలీసులు భక్షకులు కాదు రక్షకులే అని ఓ పోలీస్ నిరూపించారు. ప్రమాదానికి గురైన ఓ రైతన్నకు పోలీస్ సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణాలోని వికారాబాద్ జిల్లా లోని తాండూరుకు చెందిన ఓ రైతు ఎడ్ల బండిపై వెళ్తుండగా అనుకోకుండా ఎడ్ల బండి చక్రం ఊడిపోయింది.
దీనితో ఆ రైతు బండి చక్రాన్ని సరిచేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న తాండూరు పీఎస్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోపాల్ రైతు ఇబ్బందిని గమనించారు. వెంటనే తన కారును పక్కన ఆపారు. అనంతరం ఎడ్ల బండి చక్రాన్ని సరిచేసి రైతుకు సహాయాన్ని అందించారు. కాగా ఘటనను ఎవరో వ్యక్తి తన మొబైల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. దీనితో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎస్సైపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.