పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ సీఐను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాష్ డ్రైవింగ్ చేసి ప్రజా భవన్ ముందున్న బారీకేడ్లను ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే.

Update: 2024-02-05 05:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాష్ డ్రైవింగ్ చేసి ప్రజా భవన్ ముందున్న బారీకేడ్లను ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన షకిల్ కొడుకు తప్పించుకోవడానికి సహాయ పడిన పంజాగుట్ట మాజీ సీఐని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీంతో వారం రోజులను నుంచి సీఐ దుర్గారావు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో అతని కోసం గాలించిన పోలీసులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లులో మాజీ సీఐ దుర్గరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా హిట్ అండ్ రన్ కేసులో అతన్ని పోలీసులు ఈ రోజు విచారించిన తర్వాత అరెస్టు చేయనున్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి దుర్గరావు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు.


Similar News