సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం.. జాతీయ ఎంబీసీ సంఘం హర్షం

జ్యోతిరావుపూలే భవన్‌‌‌లో ప్రజావాణి పేరుతో నేరుగా ప్రజలు వినాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని జాతీయ ఎంబీసీ సంఘాల సమితి హర్షం వ్యక్తం చేసింది.

Update: 2023-12-23 06:56 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జ్యోతిరావుపూలే భవన్‌‌‌లో ప్రజావాణి పేరుతో నేరుగా ప్రజలు వినాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని జాతీయ ఎంబీసీ సంఘాల సమితి హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ తాజాగా ఓ ప్రకటన చేశారు. ప్రజాభవన్‌కు ప్రజలు అష్టకష్ట్రాలు పడి వివిధ జిల్లాలు నుంచి వెల్లువలా ధరఖాస్తులు వస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రతి నెల 8 లేదా 9 రోజులు నిర్వహించే ప్రజావాణికి ప్రజలు వచ్చే విధంగా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా తేదీలు ప్రకటించాలని, దీంతో ఆ తేదీల సందర్భంగా ఆయా జిల్లాల మంత్రులు ప్రజావాణిలో ఉంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని సూచించారు. స్థానికంగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పరిష్కరించబడే వాటికే ప్రజా భవనానికి ప్రజలను రాబట్టాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News