రాష్ట్రంలో నాలుగు రోజులు మండే ఎండలు

రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Update: 2023-05-14 13:08 GMT
రాష్ట్రంలో నాలుగు రోజులు మండే ఎండలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. రానున్న రోజుల్లో 41 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ప్రకటించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదని సూచించింది. కాగా, నేడు మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ జిల్లాల్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Also Read..

పీడీఎస్ రైస్ గోడౌన్ లో అగ్నిప్రమాదం..1000 క్వింటాళ్ల బియ్యం అగ్నికి ఆహుతి.. 

Tags:    

Similar News