రాష్ట్రంలో వడగళ్ల వానలు...ఆరెంజ్ అలర్ట్ జారీ

రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ..

Update: 2025-03-31 15:56 GMT
రాష్ట్రంలో వడగళ్ల వానలు...ఆరెంజ్ అలర్ట్ జారీ
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూ ఉపరితలం వేడెక్కడంతో పలు తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 1 నుంచి 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే వీలుందని, 4 న వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశముందని పేర్కొంది. వర్షాల కారణంగా 2, 3 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమరం భీం అసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, వికారాబాద్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది.

అలెర్ట్ జారీ:

తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ద్రోణి కారణంగా మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడి వర్షాలు ఆదిలాబాద్ , కుమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో కూడిన వర్షాలతో పాటు వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలలకు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగ్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా ఇదే రోజు నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చే సింది.

Similar News