Sunkishala Project : సుంకిశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్.. అధికారులపై వేటు

సుంకిశాల ప్రాజెక్టు ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది.

Update: 2024-08-14 13:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సుంకిశాల ప్రాజెక్టు ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌పై బదిలీ వేటు వేస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయనను నాన్ లోకల్ పోస్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

అదేవిధంగా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సర్కిల్ - 3 (సుంకిశాల) అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. సీజీఎం కిరణ్ కుమార్, జీఎం మరియా రాజ్, డీజీఎం ప్రశాంత్, మేనేజర్ హరీష్‌లు సస్పెండ్ అయ్యారు. మరోవైపు ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు సర్కార్ ఆదేశాలిచ్చింది.

కాగా, ఇటీవల నల్లగొండ జిల్లాలోని సుంకిశాల పథకంలో రిటైనింగ్‌ వాల్‌ నిలువునా కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 2న సుంకిశాల ఘటన జరిగితే.. వారం పాటు ఎందుకు దాచారు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Tags:    

Similar News