భారీ వర్షాల ఎఫెక్ట్.. సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించిన కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-08-31 14:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో రాగల 48 గంటల పాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై సీఎస్ శాంతికుమారి కలెక్టర్లతో సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. గంట గంటకు వర్షాలపై రిపోర్టులు తీసుకొవాలని... అదికారులతో నిత్యం చర్చించాలని సూచించారు. అలాగే భారీగా వర్షాలు కురిసే జిల్లాల్లో అవసరమైతే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని.. ఇది పూర్తిగా కలెక్టర్ల నిర్ణయమే అని.. సీఎస్ సూచించారు. ఈ నేపథ్యంలో రేపు ఆదివారం కావడంతో సోమవారం కూడా పాఠశాలలకు సెలవు ఇవ్వాలని హైదరాబాద్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెండు రోజుల పాటు హైదరాబాద్ లో విద్యార్థులకు సెలవులు వచ్చాయి.


Similar News