2 లక్షల ఉద్యోగాలిస్తాము.. నిరుద్యోగ సమస్యలు రాసుకోని రమ్మన్న సీఎం: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చినట్లు ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎమ్మెల్సీ బల్యూరి వెంకట్ తెలిపారు.

Update: 2024-03-07 17:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చినట్లు ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎమ్మెల్సీ బల్యూరి వెంకట్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ ఉంటుందని వెల్లడించారు. గురువారం బల్మూరి వెంకట్ సిటీ లైబ్రరీ కి వెళ్ళి విద్యార్థి నిరుద్యోగులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నిరుద్యోగుల్లారా.. నిరాశ నిస్పృహలకు లోను కావద్దని, ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి తో ఉందని చెప్పారు. గురుకుల ఉద్యోగాల్లో ఉన్న సమస్య, గవర్నమెంట్ స్కూల్స్ లో పీటీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నియామకాలు, అలాగే గ్రూప్ 2, 3 లో పెంచాల్సిన పోస్ట్ ల పై, జీవో నెం.46 పై సీఎం దగ్గరికి కొందరిని తీసుకొని వెళ్తానని హామీ ఇచ్చారు.

సమస్య పై అవగాహన ఉన్న విద్యార్థులను, సమస్య పై పట్టు ఉన్న ఉపాధ్యాయులు, అడ్వొకేట్ లను సీఎం దగ్గరికి తీసుకెళ్లి సమస్య లను పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. నిరుద్యోగుల కోసం ఎక్కడికైనా వస్తానని, వారి సమస్య పరిష్కారం అయ్యేవరకు అభ్యర్థుల వెంటే ఉంటామని భరోసా ఇచ్చారు. నిరుద్యోగులే తనను ఈ స్థాయికి తీసుకొని వచ్చారని గుర్తుచేశారు. కానీ ‘మనం ధర్నాలు, దీక్షలు చేసుకుంటూనే ఉందామా? సమస్య లను పరిష్కరించుకొని కొలువులు కొడదామా’ అని పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, గత ప్రభుత్వం వేసిన చిక్కుముడులు విప్పి ఉద్యోగాలు ఇస్తున్నామని అన్నారు. మీకోసం లైబ్రరీ కి, ఉస్మానియా యూనివర్సిటీ కి, తెలంగాణ లో ఎక్కడికైనా వస్తా. మా సీఎం నన్ను నిరుద్యోగుల సమస్యలు రాసుకొని రా.. పరిష్కారానికి మార్గం చూద్దామన్నారు. అందుకే మీ తరఫున నేను వచ్చాను.. వస్తూనే ఉంటా.. అని వెల్లడించారు.

Tags:    

Similar News