Balapur Laddu : కాసేపట్లో బాలాపూర్ లడ్డూ వేలం.. ఆ ఏడుగిరి మధ్యే తీవ్ర పోటీ?

బాలాపూర్ గణపతి లడ్డూ వేలం కాసేపట్లో ప్రారంభం కానుంది. 43 వసంతాల బాలాపూర్ గణేష్​వార్షికోత్సవ వేడుకల ముగింపు ఉత్సవాలు కావడంతో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది.

Update: 2023-09-28 04:40 GMT

దిశ, బడంగ్ పేట్: బాలాపూర్ గణపతి లడ్డూ వేలం కాసేపట్లో ప్రారంభం కానుంది. 43 వసంతాల బాలాపూర్ గణేష్​వార్షికోత్సవ వేడుకల ముగింపు ఉత్సవాలు కావడంతో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. అంతేకాదు.. బాలాపూర్ చరిత్రలో ఈ వేలం 30వ సారి కావడంతో ఎవరు దక్కించుకోబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ వేలం పాట కోసం ఇప్పటికే సుల్తాన్ పూర్‌కు చెందిన బొర్ర మాధవ్ రెడ్డి, ఖమ్మంకు చెందిన గణేష్, రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన కొండపల్లి గణేష్, ఎల్బీ నగర్, సాహెబ్ నగర్ అర్బన్ గ్రూప్‌కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, కర్మాన్ ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్, తుర్క యాంజాల్‌కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి, బాలాపూర్‌కు చెందిన నవార్ శ్రీనివాస్ రెడ్డి, బాలాపూర్‌కు చెందిన గండికోట శ్రీశైలంలు ముందుగా ఐదు వేలు చెల్లించి పేర్లు నమోదు చేసుకున్నారు.

బాలాపూర్ గ్రామస్తులు కాక బయటి వాళ్ళు వేలం పాటలో పాల్గొనాలంటే ముందుగా గతేడాది జరిగిన వేలం పాట మొత్తాన్ని 2022 జరిగిన వేలం పాటలో రూ.24.60 లక్షల రూపాయలను ఇప్పటికే డిపాజిట్ చేశారు. రూ.1016తో వేలం పాట సాగనుంది. గతేడాది 2022లో 24లక్షల 60వేలకు మర్రిశశాంక్​రెడ్డి సొంతం చేసుకున్నారు. కాగా, ఈ యేడు కాసేపట్లో జరుగనున్న బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట ఎంతో ఆసక్తి రేకెత్తించనుంది. మరికాసేపట్లో బాలాపూర్ పుర వీధుల గుండా ప్రారంభమైన బాలాపూర్ గణేష్ శోభా యాత్ర కాసేపట్లో గ్రామ బొడ్డు రాయికి చేరుకొనుంది. 

Tags:    

Similar News