ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు చాలా స్మార్ట్.. సీపీ శ్రీనివాస్ రెడ్డి ‘కీ’ కామెంట్స్
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన అనుమానితుడు ప్రభాకర్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసు ఇస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
దిశ, క్రైమ్ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన అనుమానితుడు ప్రభాకర్ రావుకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసు ఇస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు మాత్రం రెడ్ కార్నర్ నోటీసు ఎవరికీ ఇవ్వలేదని అయన చెప్పారు. శుక్రవారం బషీరాబాగ్ సీపీ కార్యాలయంలో అయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు చాలా స్మార్ట్, పలుకుబడి కలిగిన వారు కావడం దర్యాప్తును పారదర్శకంగా సాగిస్తున్నామని సీపీ తెలిపారు. కేసు విచారణలో నిందితులకు శిక్షలు పడే విధంగా పూర్తి ఆధారాలు సేకరిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. ఈ కేసు లో ఎవరిని వదిలి పెట్టేది లేదని ఇన్వెస్టిగేషన్‌లో తప్పు చేసిన వారిని గుర్తిస్తే వారి చర్యలు తప్పక ఉంటాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.