ఫస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ సిరిస్ టీఎస్‌కు బదులు టీజీగా మారిపోయి నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-03-16 12:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ సిరిస్ టీఎస్‌కు బదులు టీజీగా మారిపోయి నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాహనాల రిజిస్ట్రేషన్ టీజీ 0001 నంబర్‌తో ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తి విషయం చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే టీఎస్ నుంచి టీజీగా మారిన తర్వాత మొదటి రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఆర్టీఏకు భారీగా ఆదాయం వచ్చింది.

ఎప్పటిలాగే ఫ్యాన్సీ నంబర్లను అధికారులు వేలం పాట వేశారు. ఈ వేలం పాటలో ఫస్ట్ టీజీ 09 0001 నంబర్‌ను రుద్రరాజు రాజీవ్ కుమర్ అనే వాహనదారుడు దక్కించుకున్నారు. ఈ నంబర్ కోసం ఆయన 9 లక్షల 61 వేల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. టీజీ 09, 0909 నంబర్‌కు రూ. 2,20,909కు భవ్యసింధు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెట్ వేలంలో దక్కించుకుంది. కాగా, ఒక్క రోజులో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏకు రూ.2,51,86,437ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది.

Tags:    

Similar News