TG Budget-2024: ముగిసిన కేబినెట్ సమావేశం.. వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మధ్యహ్నం 12 గంటలకు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మధ్యహ్నం 12 గంటలకు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో సభలో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క ప్రతిపాదించగా అందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ హాజరయ్యారు. దీంతో మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి, శాసన మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, తెలంగాణ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గాడిన తప్పిన ఆర్థిక వ్యవస్థను రేవంత్ సర్కార్ తిరిగి నిలబెడుతుందా అన్న సందిగ్ధం అందరిలోను నెలకొంది. ఇప్పటికే ఓటాన్ అకౌంట్ రూ.2,75,891 కోట్లు కాగా.. ఈ సారి వివిధ విభాగాలకు రూ.2.97 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.