TG Assembly: కాళేశ్వరం డీపీఆర్‌కు.. నిర్మాణానికి తేడా ఉంది: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఎస్ఎల్‌బీసీ (SLBC)లో కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation)పై కీలక ప్రకటన చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల్లో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఎస్ఎల్‌బీసీ (SLBC)లో కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation)పై కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికితీశామని ప్రకటించారు. మిగతా డెడ్‌బాడీస్ బయటకు తీసేందుకు 34వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సభ దృష్టి తీసుకొచ్చారు. డీ-1, డీ-2 ప్రదేశాల్లో మట్టి తవ్వకాలు, డీ-వాటరింగ్‌ను బయటకు పంపే ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్రతికూల పరిస్థితుల్లో 24 గంటల పాటు శ్రమిస్తున్నాయని సభలో ఆయన ప్రస్తావించారు.
ప్రాజెక్టుల నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం..
సహాయక చర్యలు పూర్తి అవ్వగానే ఎస్ఎల్‌బీసీ (SLBC)తో పాటు ప్రాణహిత-చేవెళ్ల (Pranahita-Chevella) ప్రాజెక్టులను పూర్తి చేస్తామని.. అందుకు ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని కామెంట్ చేశారు. త్వరలోనే తుమ్మడిహట్టి (Thummadihatti) వద్ద ప్రాజెక్ట్ పనులు త్వరలో ప్రారంభించబోతున్నామని అన్నారు. కాళేశ్వరం (Kaleswaram)పై విజిలెన్స్ రిపోర్టు (Vigilance Report) తమకు అందిందని ప్రకటించారు. ప్రాజెక్ట్ డీపీఆర్ (DPR)కు.. నిర్మాణానికి చాలా వ్యత్యాసం ఉందని అన్నారు. ఈ విషయంలో తాము ఎన్‌డీఎస్ఏ రిపోర్టు (NDSA Report) కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌ను కలిసి ఎన్‌డీఎస్ఏ రిపోర్టు (NDSA Report) త్వరిగతిన ఇవ్వాలని కోరామని అన్నారు. కాళేశ్వరం (Kaleswaram)పై జ్యుడిషియల్ విచారణ (Judicial Inquiry) కొనసాగుతోందని పేర్కొన్నారు. వచ్చే రిపోర్టు ఆధారంగానే బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.