TET Syllabus: టెట్ సిలబస్ విడుదల చేసిన విద్యాశాఖ.. డౌన్‌లోడ్ లింక్ ఇదే..!
తెలంగాణ(TG)లోని ప్రభుత్వ పాఠశాల(Govt Schools)ల్లో ఉపాధ్యాయ పోస్టుల అర్హతకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) నోటిఫికేషన్ ను నవంబర్ 7న రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(TG)లోని ప్రభుత్వ పాఠశాల(Govt Schools)ల్లో ఉపాధ్యాయ పోస్టుల అర్హతకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) నోటిఫికేషన్ ను నవంబర్ 7న రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. టెట్ పరీక్షలను జనవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో కండక్ట్ చేయనున్నారు. డిసెంబర్ 26వ తేదీ నుంచి హాల్‌టికెట్లు(Hall Tickets) డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రోజుకు రెండు సెషన్ల(Two Sessions)లో పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ పరీక్షలకు సంబంధించిన సిలబస్(Syllabus)ను అధికారిక వెబ్‌సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/Syllabusలో అందుబాటులో ఉంచారు. గత టెట్(TET)కు, తాజా టెట్ సిలబస్ కు ఎలాంటి మార్పులు లేవు. కాగా టెట్ పరీక్షకు మొత్తం 2,75,773 మంది దరఖాస్తు చేసుకోగా.. పేపర్-1కు 94,335 మంది, పేపర్-2కు 1,81,438 మంది అప్లై చేసుకున్నారు.