సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్
సికింద్రాబాద్(Secunderabad)లో ఉత్రిక్త పరిస్థితి నెలకొంది. ముత్యాలమ్మ ఆలయం(Muthyalamma Temple) వద్ద హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తలకు దారి తీసింది.
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్(Secunderabad)లో ఉత్రిక్త పరిస్థితి నెలకొంది. ముత్యాలమ్మ ఆలయం(Muthyalamma Temple) వద్ద హిందూ సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తలకు దారి తీసింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపైకి చెప్పులు, కుర్చీలు విసిరారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి లాఠీచార్జ్‌కి దారి తీసింది. కాగా, ఇటీవల సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం చేసిన ఘటన హిందువులను ఆగ్రహానికి గురిచేసింది. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసింది ముంబయికి చెందిన సల్మాన్ సలీం ఠాకూర్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.