చెప్పులపై కూడా జీఎస్టీ వేయడం దారుణం: మహిళా కాంగ్రెస్

దిశ, తెలంగాణ బ్యూరో: పెంచిన ధరల కారణంగా ఆలిండియా మహిళా కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ‘మెహంగై పే హల్లా బోల్’ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.

Update: 2022-09-04 14:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పెంచిన ధరల కారణంగా ఆలిండియా మహిళా కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో 'మెహంగై పే హల్లా బోల్' కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెంచారని మండిపడ్డారు. చివరికి చిన్న పిల్లలు తాగే పాలు, చదువుకునే విద్యార్థుల పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, చెప్పులపై కూడా జీఎస్టీ వేయడం విచారకరమన్నారు. మధ్యతరగతి ప్రజలకు ధరల మోత ఎనిమిదేళ్లలో 60 నుంచి 75 శాతం పెరిగాయని తెలిపారు. పెరిగిన ధరల వల్ల సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టి అన్ని ప్రైవేటు పరంగా చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్‌ల పేరుతో పేద ప్రజలను చంపేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కోఆర్డినేటర్ నీలం పద్మ, హైదరాబాద్ అధ్యక్షురాలు వరలక్ష్మి, రంగారెడ్డి అధ్యక్షులు జయమ్మ, సదాలక్ష్మి, సరిత, రాధా, సరళ, ఇందిరా, ధనలక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News