డయాలసిస్ సేవల్లో తెలంగాణ టాప్ : Harish Rao
డయాలసిస్ సేవల్లో తెలంగాణ టాప్ గా నిలుస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: డయాలసిస్ సేవల్లో తెలంగాణ టాప్ గా నిలుస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు రూ. 2 కోట్లతో సమకూర్చుకున్న ఇంట్రా ఆపరేటివ్ ఆల్ట్రా సౌండ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, ఆల్ట్రా సోనిక్ ఆస్పిరేట్ వైద్య పరికరాలను ట్రామా బ్లాక్ (EMD)లోని మూడో ఫ్లోర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా వస్క్యులర్ సర్జరీ సింపోసియం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. రోజు ఎంతో సాంకేతికత పెరుగుతోందన్నారు.
ప్రముఖ కిడ్నీ స్పెషలిస్టు దామోదర్ రెడ్డి కుంబాల మంచి హృదయంతో ముందుకొచ్చి మనకు నైపుణ్యాలు పెంచుతున్నారని తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ మోడల్ వాళ్ల రాష్ట్రంలో అడాప్ట్ చేస్తుమన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 డయాలిసిస్ కేంద్రాలు ఉండవని ప్రస్తుతం వాటిని 102 కి పెంచుకున్నామన్నారు. డయాలిసిస్ మీద తెలంగాణ ప్రభుత్వం ఏటా వంద కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. డయాలసిస్ చేసుకునే వారికి బస్ పాస్, పింఛన్లు, జీవిత కాల మందులు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొమన్నారు.తెలంగాణలో 50 లక్షల డయాలసిస్ సైకిళ్ళు పూర్తి చేశామని తెలిపారు. డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సురక్షిత మంచి నీరు అందిస్తున్నదని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి ఉపరితల మంచి నీరు వంద శాతం అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.
ప్రజల్లో ఎక్కువ బీపీ షుగర్ వస్తున్నాయని ప్రాథమిక దశలో గుర్తించి మందులు ఇస్తున్నామన్నారు. ఎన్ సీ డీ స్క్రీనింగ్ చేసి మందులు ఇస్తున్నామన్నారు. పెద్ద వారికి అర్ధం అయ్యేలా వివిధ రంగుల మూడు పౌచుల్లో మందులు పెట్టీ అందిస్తున్నామని తెలిపారు. పేదలకు అత్యున్నత వైద్యం తెలంగాణలో అరోగ్య శ్రీలో అందుతోందన్నారు. నిఫ్రాలజీ పనితీరు అద్బుతతమన్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అత్యధికంగా నిమ్స్ లో జరుగుతున్నాయని తెలిపారు. జీవన్ దాన్ అవయవ దానం వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉందని అందరం కలిసి అవయవదానం ప్రోత్సహించాలన్నారు. ఐసీయూ పడకలు డబుల్ చేసుకున్నామన్నారు. గత ఏడాది వచ్చిన సమయంలో ఎక్విప్మెంట్ కోసం 150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ప్రొఫెసర్ పోస్టులు సహా ఇతర అన్ని పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
Also Read...
బావా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవులు తీసుకుంటే విమర్శలు వస్తాయ్.. !