Stock Market Fraud : ‘స్టాక్ మార్కెట్’ మోసాలపై తెలంగాణ పోలీస్ కీలక సందేశం

‘స్టాక్ మార్కెట్’ మోసాలతో బీ కేర్‌ఫుల్ అంటూ తెలంగాణ పోలీసులు సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీస్ అధికారిక ఖాతా ద్వారా సందేశం ఇచ్చారు.

Update: 2024-08-22 08:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ‘స్టాక్ మార్కెట్’ మోసాలతో బీ కేర్‌ఫుల్ అంటూ తెలంగాణ పోలీసులు సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీస్ అధికారిక ఖాతా ద్వారా కీలక సందేశం ఇచ్చారు. పెట్టుబడుల పేరుతో మీతో పలు యాప్‌లు డౌన్‌లోడ్ చేయించి అందులో వర్చువల్ లాభాలు చూపించి వాటిని పొందాలంటే డబ్బు కట్టాలంటూ చెప్పి సైబర్ నేరగాళ్లు సర్వం దోచేస్తారు.. జాగ్రత్త.. అంటూ పేర్కొన్నారు.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందొచ్చంటూ ఇంటర్నెట్, షోషల్ మీడియా ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు వల పన్ని నకిలీ లాభాలు చూపిస్తారని వెల్లడించారు. మరింత పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టి మీ నుంచి సర్వం దోచేశాక మొహం చటాలేటేస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే అనధికార యాప్‌లు, వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Tags:    

Similar News