ఆరు వారాల్లోపు డబ్బులు చెల్లించండి.. హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశం
విశాఖ ఇండస్ట్రీస్‌కు ఆరు వారాల్లోపు రూ.17.5 కోట్లు చెల్లించాలని(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) హెచ్‌సీఏకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి విశాఖ ఇండస్ట్రీస్ బ్యాంక్‌లో లోన్ తెచ్చి స్పాన్సర్ షిప్ చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ ఇండస్ట్రీస్‌కు ఆరు వారాల్లోపు రూ.17.5 కోట్లు చెల్లించాలని(హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) హెచ్‌సీఏకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి విశాఖ ఇండస్ట్రీస్ బ్యాంక్‌లో లోన్ తెచ్చి స్పాన్సర్ షిప్ చేసింది. ఆ తర్వాత హెచ్‌సీఏ - విశాఖ ఇండస్ట్రీస్ మధ్య స్పాన్సర్ షిప్ అగ్రిమెంట్‌ను హెచ్‌సీఏ క్యాన్సల్ చేసింది. దీంతో విశాఖ ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్లింది.
అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినందుకు విశాఖ ఇండస్ట్రీస్‌కు 18 శాతం యానువల్ ఇంటరెస్ట్‌తో రూ.25 కోట్లు చెల్లించాలని గతంలోనే కోర్టు ఆదేశించింది. కాగా, విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో హెచ్‌సీఏ ప్రాపర్టీస్‌ను, బ్యాంక్ ఖాతలను 2022 అక్టోబర్‌లో కమర్షియల్ కోర్టు అటాచ్ చేసింది. ఈ క్రమంలో బాంక్ అకౌంట్స్ డీ ఫ్రీజ్ చేయాలని హైకోర్టులో హెచ్‌సీఏ అప్పీల్ చేసింది. ఆరు వారాల్లోగా రూ.17.5 కోట్లు విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించాలని ఇవాళ విచారణ జరిగిన అనంతరం హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశించింది.