CM Revanth : మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి వాహనం తనిఖీ.. బ్యాగులు చెక్ చేసిన పోలీసులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచార నిర్వహించబోతున్నారు.

Update: 2024-11-16 08:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహారాష్ట్రలో రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ చంద్రపూర్‌లో ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనాన్ని మహారాష్ట్ర పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులు ఆపి సీఎం వాహనంలో ఉన్న బ్యాగులు తనిఖీ చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రంలోని నయగావ్, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ (Maharashtra Eelections) ఎన్నికల్లో అధికార మహాయతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. దీంతో అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి.


Click Here For Twitter Post..

Tags:    

Similar News