Bandi Sanjay Kumar : బండికి హైకమాండ్ పిలుపు.. హుటాహుటిన ఢిల్లీ బయలుదేరిన BJP స్టేట్ చీఫ్..!

రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడించాలని చూస్తున్న బీజేపీ క్రమంగా స్పీడ్ పెంచుతోంది.

Update: 2023-06-26 11:16 GMT
Bandi Sanjay Kumar : బండికి హైకమాండ్ పిలుపు.. హుటాహుటిన ఢిల్లీ బయలుదేరిన BJP స్టేట్ చీఫ్..!
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడించాలని చూస్తున్న బీజేపీ క్రమంగా స్పీడ్ పెంచుతోంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆదేశించిన హైకమాండ్ తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను హస్తినకు రావాలని ఆదేశించింది. దీంతో బండి సంజయ్ హుటాహుటిన తన అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ బాటపట్టారు.

బీజేపీ జాతీయ నాయకత్వం టీబీజేపీ నేతలతో వరుసగా జరుపుతున్న చర్చల వెనుక మర్మం ఏంటనేది అంతుచిక్కడంలేదు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలతో వరుస సమావేశాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ వెళ్లిన బండి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారని సమాచారం. ఎవరెవరిని కలుస్తారనేది అంశంపై స్పష్టతరావాల్సి ఉంది.

దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణను ఫిక్స్ చేసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయింది. దీంతో సౌత్ స్టేట్స్‌లో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నిరోజులుగా సైలెంట్‌గా ఉన్న జాతీయ నాయకత్వం ఒక్కసారిగా తెలంగాణపై ఫోకస్ పెట్టడం, నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.

కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంలగాణ బీజేపీలో పలు అనూహ్య పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. నేతల వివాదాస్పద కామెంట్లు, రాష్ట్ర నాయకత్వం మార్పు వంటి అంశాలు పార్టీకి చేటు చేశాయి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే దక్షిణాది కష్టమే అని హైకమాండ్ భావించి నేతలతో ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడించాలని చూస్తున్న బీజేపీ హైకమాండ్‌కు రాష్ట్ర నేతల మధ్య సమన్వయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. టీబీజేపీ నేతల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల పార్టీకి నష్టం కలిగించే అంశాలపైనా హైకమాండ్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ తీరు మార్చుకోవాలని జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా అసంతృప్త నేతలతో భేటీ అనంతరం బండి సంజయ్ ఢిల్లీ టూర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బండికి ఎలాంటి అంశాలపై హైకమాండ్ దిశానిర్దేశం చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. కొద్దిరోజులుగా రాష్ట్ర నాయకత్వంలో మార్పులంటూ ప్రచారం జరుగుతోంది. ఈటలకు కీలక బాధ్యతలు అని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో తాజా మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. టీ బీజేపీ నేతలతో హైకమాండ్ నిర్వహిస్తున్న సమావేశాలు ఎంతమేరకు ఫలితాన్నిస్తుందనేది తెలియడంలేదు. కానీ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జాతీయ నాయకత్వం తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : నకిరేకల్ కాంగ్రెస్‌లో కల్లోలం.. క్షేత్ర స్థాయిలో బలమున్న నో యూస్!

Tags:    

Similar News