తెలంగాణ అసెంబ్లీ రేపటి వాయిదా.. ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.

Update: 2024-07-30 17:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. కాగా, మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సెషన్ ప్రారంభం అయ్యింది. ఇవాళ సభలో వివిధ శాఖలపై చర్చ జరగడంతో పాటు ప్రభుత్వం ఒక బిల్లును సభ ముందుకు తీసుకొచ్చింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) బిల్లు–2024ను మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశ పెట్టారు.

అనంతరం వివిధ శాఖలపై డిస్కస్ చేశారు. ముఖ్యంగా సివిల్ సప్లై శాఖపై చర్చ హాట్ హాట్‌గా నడిచింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య డైలాగ్ వార్‌తో అసెంబ్లీ దద్దరిల్లింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు. గులాబీ పార్టీ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


Similar News