సింగరేణి వ్యాప్తంగా TBGKS నిరసనలు
బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. అన్ని గనులు, డిపార్ట్మెంట్‌లో ఈ నిరసన చేపట్టారు.
దిశ,ఆదిలాబాద్ బ్యూరో:బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. అన్ని గనులు, డిపార్ట్మెంట్‌లో ఈ నిరసన చేపట్టారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కొంతకాలంగా కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించక పోవడంతో సింగరేణి ఉనికికి ప్రమాదం ఏర్పడిందన్నారు. 41 వేల మంది భవిష్యత్ అంధకారంగా మారుతుందని అవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు.