హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాలను పట్టించుకోండి.. అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ అంతా హైదరాబాద్ పైనే పెడుతున్నారని, మిగతా జిల్లాలను కూడా పట్టించుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని అన్నారు.

Update: 2025-03-24 10:32 GMT
హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాలను పట్టించుకోండి.. అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఫోకస్ అంతా హైదరాబాద్ (Hyderabad) పైనే పెడుతున్నారని, మిగతా జిల్లాలను కూడా పట్టించుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు (CPI MLA Kunamneni Sambashiva Rao) అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కూనంనేని మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇండస్ట్రియల్ పాలసీ (Industrial Polocy) ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇండస్ట్రీస్ (Industries) విషయంలో ప్రభుత్వం ఫోకస్ అంతా హైదరాబాద్ పైనే ఉన్నట్లు కనిపిస్తుందని, జిల్లాల్లో అనేక ఖనిజాలు, పంటల సదుపాయాలు ఉన్నాయని, వాటిపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాల్లో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోకపోతే అవన్నీ నిర్వీర్యం అయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. బయ్యారం (Bayyaram) ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం అని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ (Steel Plant) ఏర్పాటు చేయాలని కోరారు. ఈ బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలో అవకాశం ఉందని చెప్పిన కేంద్రం.. మళ్లీ ఇప్పుడు లేదని చెబుతూ రకరకాల కారణాలు చెబుతోందని అన్నారు. ఇక కొత్తగూడెంలో ఎర్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కూనంనేని విన్నవించారు. 

Tags:    

Similar News