TSPSC ప్రశ్న పత్రాల లీకేజీలపై T- బీజేపీ కీలక నిర్ణయం

టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది.

Update: 2023-03-15 15:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. తొమ్మిది మందితో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు ఈ బృందాన్ని నియమించారు. కన్వీనర్‌గా టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్‌ను నియమించారు. సభ్యులుగా మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఐఏఎస్ చంద్రవదన్, మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, బీజేపీ మహిళా మోర్చా జాతీయ పాలసీ రీసెర్చ్ కన్వీనర్ కరుణాగోపాల్ ఉన్నారు. కాగా లీకేజీ ఘటనపై వాస్తవ విషయాల అధ్యయనం, తగిన కార్యాచరణపై ఈ కమిటీ పనిచేయనుంది.

Tags:    

Similar News