Chanchalguda Jail: ఆమె నుంచి ఆర్డర్స్ వచ్చాకే అల్లు అర్జున్ విడుదల

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) విడుదలపై సస్పెన్స్ వీడటం లేదు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) సూపరింటెండెంట్ సెలవులో ఉన్నట్లు సమాచారం.

Update: 2024-12-13 17:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) విడుదలపై సస్పెన్స్ వీడటం లేదు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) సూపరింటెండెంట్ సెలవులో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆర్డర్ కాపీని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్ర(Soumya Mishra) వెరిఫై చేయనున్నారు. ఆమె నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్నారు. ఇదంతా జరిగే సరికి మరో అరగంట నుంచి గంట వరకు సమయం పట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు.. విడుదల ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో అల్లు అర్జున్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బన్నీని చూసేందుకు జైలు వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. అల్లు అర్జున్‌ సన్నిహితులు, బంధువులు ఆయన నివాసం వద్ద వేచి ఉన్నారు.

Tags:    

Similar News