మూసీ బఫర్ జోన్లో నిర్మాణాలపై సర్వే : దాన కిషోర్

త్వరలోనే మూసీ(Musi) నది బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలపై సర్వే చేపట్టనున్నట్టు మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్ పేర్కొన్నారు.

Update: 2024-09-27 15:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : త్వరలోనే మూసీ(Musi) నది బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలపై సర్వే చేపట్టనున్నట్టు మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ దాన కిషోర్ పేర్కొన్నారు. నిర్మాణాల సర్వే చేపట్టి మార్కింగ్ కూడా చేయనున్నట్టు తెలిపారు. కొంతమందికి మూసీ నదీ గర్భంలో స్థల పట్టాలున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వాటన్నిటిని పరిశీలిస్తామని అన్నారు. అలాంటి పట్టలున్నవారు వెంటనే సంబంధిత కలెక్టర్లను కలవాలని, ఆయా పట్టాలను పరిశీలించి అర్హులకు పరిహారం, పునరావాసం కల్పిస్తామని వెల్లడించారు. బఫర్ జోన్లో పట్టాలు ఉన్న వారికి కూడా పునరావాసం, నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి మోసపూరిత మాటలు నమ్మొద్దు అని, ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఏమైనా సందేహాలుంటే నిర్వాసితులు సంబంధిత అధికారులను లేదా కలెక్టర్లను కలవాలని ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఎండీ దాన కిషోర్ తెలియ జేశారు.


Similar News