Supreme Court: బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. బుల్డోజర్ల న్యాయంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎగ్జిక్యూటివ్ అధికారులు న్యాయ ప్రక్రియను తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని ధర్మాసనం తెలిపింది. నిందితులను దోషిగా చిత్రీకరించలేమని, దాని ఆధారంగా వాళ్ల ప్రాపర్టీలను నాశనం చేయడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కేవలం నిందితులో లేక దోషులో అయినంత మాత్రానా.. వాళ్ల ఇండ్లను కూల్చడం రాజ్యాంగ వ్యతిరేకమే అవుతుందని కోర్టు చెప్పింది. అయితే ఇదే తరుణంలో నీటి వనరులు, ప్రభుత్వ భూములు, నాలాలు, రోడ్లు, పార్కులకు ఈ ఆదేశాలు వర్తించవని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ధర్మాసనం వ్యాఖ్యలపై హైడ్రా కమిషనర్ గతంలో స్పష్టత ఇచ్చారు. కోర్టు ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. యూపీలోని నేరస్థులు, నిందితుల ఇళ్ల కూల్చివేతలకు మాత్రమే ఆ ఆదేశాలు వర్తిస్తాయన్నాని అన్నారు. చెరువుల, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తోందని వెల్లడించారు. నేరస్తుల, నిందితులకు సంబంధించిన ఆస్తుల జోలికి హైడ్రా వెళ్లడం లేదన్నారు. బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపులో తమ ఆదేశాలు వర్తించవని సుప్రీం కోర్టు స్వయంగా తెలిపిందని వెల్లడించారు.