Seethakka:ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సమ్మర్ స్పెషల్ డ్రైవ్.. అదికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు
వేసవిలో నీటి ఎద్దడి రావొద్దని సీతక్క అధికారులను ఆదేశించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : రాబోయే వేసవిలో ప్రజలకు నీటి కష్టాలు (Summer Water Problems) లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సీతక్క (Seethakka) ఆదేశించారు. ఇవాళ హైదరాబాద్‌లో మిషన్ భగీరథ (Mission Bhagiratha) పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, వచ్చే 5 నెలల కోసం ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్నారు. మిషన్ భగీరథ నీళ్లపై నమ్మకం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.