బ్యారేజీల నిర్మాణంలో సబ్ కాంట్రాక్టులు! కమిషన్ విచారణలో వెలుగులోకి నిజాలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల డ్యామేజీపై టెక్నికల్ అంశాలపై ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్.. ఆర్థిక అంశాలపైనా ప్రాథమిక విచార ణ

Update: 2024-07-12 02:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల డ్యామేజీపై టెక్నికల్ అంశాలపై ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్.. ఆర్థిక అంశాలపైనా ప్రాథమిక విచార ణ ప్రారంభించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎల్అండ్‌టీ, ఆఫ్కాన్స్, నవయుగ కాంట్రాక్టు సంస్థలు నిర్మించినప్పటి కీ.. వీటిలో దాదాపు 50కి పైగా కంపెనీలు సబ్ కాంట్రాక్టు పేరుతో పనులు చేసినట్లు కమిషన్ ప్రాథమిక ఎంక్వయిరీలో తేలింది.

పంప్ హౌజ్ ప్రతినిధుల విచారణ

పంప్ హౌజ్‌లకు సంబంధించిన ముగ్గురు ప్రతినిధులు గురువారం ఎంక్వయిరీకి హాజరయ్యా రు. ఈ నెల 16 లోగా అఫిడవిట్లను దాఖలు చే యాల్సిందిగా వారిని కమిషన్ ఆదేశించింది. పంప్‌హౌజ్‌ల నుంచి నీటి విడుదలకు ఇచ్చిన ఆదేశాలు, నీటి నిల్వ, విడుదల చేసిన నీరు త దితర వివరాలను కమిషన్ రాబట్టింది. వర్క్స్, అకౌంట్స్ విభాగం డైరెక్టర్ ఫణిభూషణ్‌ శర్మ గురువారం విచారణకు హాజరై కొన్ని వివరాలను కమిషన్‌కు అందజేశారు.

నేడు కమిషన్ ఎదుట ప్రైవేటు వ్యక్తులు

ఆర్థిక అంశాల విచారణలో భాగంగా పలువురు ప్రై వేటు వ్యక్తులు కమిషన్ ముందు శుక్రవారం హాజరై కొన్ని వివరాలను ఇవ్వనున్నారు. పంప్‌ హౌజ్‌ల నిర్వహణలో విద్యుత్ వినియోగానికి సంబంధించి విద్యుత్ శాఖలో అధికారిగా ఉన్న రఘు ఈ నెల 15న కమిషన్‌ ముందు హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధిం చి లోతైన వివరాలను అందించాలని కమిషన్ కోరిక మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ ఈ నెల 16న హాజరుకానున్నారు.

సీఏ, సీనియర్ న్యాయవాది కోసం రిక్వెస్ట్

ఆర్థిక అంశాలకు సంబంధించి విచారణను ముమ్మ రం చేయాలని కమిషన్ భావిస్తున్నది. కాళేశ్వ రం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనా వ్య యం, దాన్ని సవరించడానికి దారితీసిన పరిస్థితులు, ద్రవ్య సంస్థల నుంచి తీసుకున్న రుణం, దానికి చెల్లిస్తున్న వడ్డీ, కాంట్రాక్టు కంపెనీలకు నిధుల విడుదల, లోపాలున్నట్లు ‘కాగ్’ గుర్తించడం.. తదితర అంశాలపై కమిషన్‌కు సహాయకారిగా ఉండేందుకు ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ ను నియమించాల్సిందిగా త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ ఘోష్ లేఖ రాయనున్నారు. ఆర్థిక అంశాలపై విచారణ ముగిసిన తర్వాత ఓపెన్ హౌజ్ ఎంక్వయిరీ నిర్వహించనున్నారు.


Similar News