G. Kishan Reddy ఎక్కడ చర్చ పెట్టినా వస్తా.. మంత్రి హరీశ్ రావు సవాల్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు.

Update: 2022-12-01 13:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ భవనాన్ని మంత్రి పరిశీలించారు. అనతరం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ పనులను పర్యవేక్షించారు. జిల్లా అధికారులు, స్థానిక నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. సోయిలో ఉండే మాట్లాడుతున్నారా? అంటూ విరుచుకుపడ్డారు. ఇక బండి సంజయ్ మాటలకైతే తలాతోక ఉండదని ఎద్దేవా చేశారు. నిధుల విషయం తేల్చుకునేందుకు.. కిషన్ రెడ్డితో చర్చల కోసం ఎక్కడికైనా వస్తానని హరీశ్ రావు సవాల్ విసిరారు.

కేంద్రానికి తెలంగాణ రూ.30 వేల కోట్లు జీఎస్టీ ఇచ్చామని తెలిపిన మంత్రి.. అదే కేంద్రం తెలంగాణకు కేవలం రూ. 8 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. 42 శాతం నిధులు ఇచ్చామని చెప్తున్న కేంద్రం.. కేవలం 29 శాతం మాత్రమే ఇచ్చిందన్నారు. దొడ్డిదారిన కేంద్రం నిధులు చేకూర్చుకుంటోందని దుయ్యబట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ.. నెలకు లక్ష కోట్లు అప్పు తెస్తోందన్న హరీశ్ రావు.. గడిచిన ఆరు నెలల్లో కోటి కోట్ల అప్పులు తెచ్చారని పేర్కొన్నారు. ఇక ఈడీ, ఐటీ సంస్థలు బీజేపీ విడిచిన బాణాలని.. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో అవి ముందే వస్తాయని హరీశ్ రావు తెలిపారు. కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా.. భయపడేది లేదన్నారు.

Tags:    

Similar News