Srujan Reddy : కేటీఆర్ పై క్రిమినల్ పిటీషన్ దాఖలు చేసిన సృజన్‌రెడ్డి

వ్యాపార వేత్త, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బావమరిదియైన సూదిని సృజన్‌రెడ్డి(Srujan reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR )పై నాంపల్లి స్పెషల్ కోర్ట్‌లో క్రిమినల్ పిటీషన్ (Criminal petition)దాఖలు చేశారు.

Update: 2024-11-23 10:44 GMT

దిశ, వెడ్ డెస్క్ : వ్యాపార వేత్త, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బావమరిదియైన సూదిని సృజన్‌రెడ్డి(Srujan reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR )పై నాంపల్లి స్పెషల్ కోర్ట్‌లో క్రిమినల్ పిటీషన్ (Criminal petition)దాఖలు చేశారు. అమృత్‌-2 కాంట్రాక్ట్ టెండర్లపై కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేయ‌డాన్ని సవాల్ చేస్తూ సృజన్‌రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. శోధ కన్‌స్ట్రక్షన్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేక‌పోయినా ఆ సంస్థతో త‌న‌ను లింక్ చేస్తూ అంద‌రినీ తప్పుదారి పట్టిస్తున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. అమృత్-2కు పారదర్శకంగానే టెండర్ల కేటాయింపు జరిగినా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని, లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోనందుకే క్రిమినల్ పిటీషన్ దాఖలు చేశానని సృజన్‌రెడ్డి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన బావమరిది సూదిని పై ఇటీవల కేటీఆర్ పలు ఆరోపణలు చేశారు. రేవంత్‌ రెడ్డి ఆధీనంలో ఉన్న పురపాలక శాఖ ద్వారా కేంద్రం అమలు చేస్తున్న ‘అమృత్‌’ పథకంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన సంస్థకు ఏకంగా రూ.8,888కోట్ల విలువైన టెండర్‌ను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. సృజన్‌రెడ్డికి చెందిన శోధా కన్‌స్ట్రక్షన్‌ లిమిటెడ్‌కు అర్హతలు లేకపోయినా అమృత్ స్కీమ్ లో రూ.1137కోట్ల రూపాయల పనులను కట్టబెట్టారని విమర్శించారు. గత ఏడాది కేవలం రెండు కోట్ల లాభాలు సాధించిన కంపెనీకి వెయ్యి కోట్లకుపై పనులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. బావమరిది కళ్లలో సంతోషం చూడడం కోసం రేవంత్‌ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, తన ఇంట్లో లంకె బిందలు నింపుకోవడం కోసం అక్రమ టెండర్లకు తెరలేపారని ధ్వజమెత్తారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలంటూ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు సైతం కేటీఆర్ ఫిర్యాదు చేశారు. తమకు అందిన సమాచారం మేరకు మొత్తం 8 ప్యాకేజీల్లో టెండర్లు ఖరారయ్యాయని, నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో ఈ ప్యాకేజీల కింద పనులు జరిగాయని, ప్రస్తుతం ఒక్క ప్యాకేజీలోని అక్రమాలనే మేం బయట పెడుతున్నామని కేటీఆర్ తెలిపారు. ఇందులో సీఎం స్వయంగా జోక్యం చేసుకుని ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ (ఐహెచ్‌పీ) అనే కంపెనీకి రూ.1137కోట్ల విలువైన టెండర్‌ను కట్టబెట్టారు. కానీ.. ఆ కంపెనీ తాము కొన్ని పనులే చేస్తామని, మిగతావి వేరే కంపెనీ చేస్తుందని.. పేర్కొంటూ సెబీకి సమాచారం ఇచ్చిందని, ఐహెచ్‌పీని శిఖండిలా అడ్డుపెట్టుకొని రేవంత్‌రెడ్డి, సూదిని సృజన్‌రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. కేటీఆర్ తమపై చేసిన ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సృజన్‌రెడ్డి న్యాయ పోరాటానికి దిగడంతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. 

Tags:    

Similar News