Sridhar Babu: కేటీఆర్ పగటి కలలు కంటున్నారు.. కేటీఆర్ పై శ్రీధర్ బాబు ఫైర్
కేటీఆర్ పగటి కలలు కంటున్నారని కేటీఆర్ పై శ్రీధర్ బాబు ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: కేటీఆర్ (KTR) ప్రతీది రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు (MLAs training classes) రావొద్దని కేటీఆర్ చెప్పారని దీన్ని బట్టి ఆ పార్టీ మానసిక స్థితి ఏంటో తెలుస్తుందన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఇవాళ్టి నుంచి ప్రభుత్వం శిక్షణా తరగతలు నిర్వహిస్తోంది. ఈ తరగతులను బీఆర్ఎస్ బహిష్కరించడంపై ఓ మీడియా చానల్ తో ఇవాళ మాట్లాడిన శ్రీధర్ బాబు.. కేటీఆర్ ఆశల పల్లకిలో ఉన్నారని నాలుగేళ్లలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఫైర్ అయ్యారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఎవరూ తొలగించలేరన్నారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు రావొద్దని కేటీఆర్ చెప్పారు. దీన్ని బట్టి ఆ పార్టీ మానసిక స్థితి ఏంటో తెలుస్తోందన్నారు. మళ్లీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అని సెటైర్ వేశారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఆ పార్టీ మాట్లాడుతున్న తీరు విడ్డూరంగా ఉందన్నారు.