CM Revanth Reddy: తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్
జూబ్లీహిల్స్ నివాసంలో బీసీ కులగణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ నివాసంలో బీసీ కులగణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. కులగణన(Caste Census)పై హైకోర్టు(High Court) తీర్పుపై చర్చించారు. రాష్ట్రంలో బీసీ కులగణన(BC Caste Census)కు డెడికేషన్ కమిషన్(Dedication Commission) ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. హైకోర్టు(High Court) తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. సోమవారంలోగా డెడికేషన్ కమిషన్(Dedication Commission) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మరోసారి సీఎం రేవంత్(CM Revanth Reddy) స్పష్టం చేశారు. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. ఈ సమీక్షలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.