సింగరేణి కీలక నిర్ణయం.. అక్కడ పవర్ ప్లాంట్‌కు ప్రతిపాదన!
విద్యుత్ ఉత్పత్తి అంశంలో సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ ఉత్పత్తి అంశంలో సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో థర్మల్ పవర్ ప్లాంట్‌ల నిర్మాణానికి వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే సింగరేణికి మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1200 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఉంది. అయితే రామగుండంలో ఉన్న జెన్‌కోకు చెందిన 62.5 మెగావాట్ల థర్మల్ కేంద్రాన్ని అప్పగిస్తే అదే ప్లేస్ లో రూ.10 వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో 800 మెగావాట్ల థర్మల్ కేంద్రం నిర్మాణం చేపడతామని స్టేట్ గవర్నమెంట్‌కు ప్రపోజల్ చేసింది. అయితే రామగుండంలోని పాత ప్లాంట్ నిర్మించి 50 ఏళ్లు దాటడం, ఈ ప్లాంట్ ను మూసేయాలని నిపుణుల బృందం సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్ ను మూసివేస్తే 250 ఎకరాల స్థలం తమకు అప్పగించాలని సింగరేణి ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మినిస్టర్ భట్టి స్పష్టం చేశారు.