Singareni Jobs: నిరుద్యోగులకు బంపర్ న్యూస్.. సింగరేణిలో కొలువుల జాతర
ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ శుభవార్త చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. కంపెనీలోవివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, అందులో ఎగ్జిక్యూటివ్ కేడర్/నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలను పూర్తి చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 29వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
దరఖాస్తు ఫీజు రూ.వెయ్యి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.వందగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://scclmines.com/ వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలని వెల్లడించారు.మొత్తం 327 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయగా.. అందులో మేనేజ్‌మెంట్ ట్రైనీ, ఇ2 గ్రేడ్: 42 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ , ఇ2 గ్రేడ్: 07 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ, టీ అండ్ ఎస్ గ్రేడ్-సి: 100 పోస్టులు అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ, టీ అండ్ ఎస్ గ్రేడ్-సి: 09 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ, టీ అండ్ ఎస్ గ్రేడ్-సి: 24 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ-I: 47 పోస్టులు, ఎలక్ట్రీషియన్ ట్రైనీ, కేటగిరీ-I: 98 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
ఉద్యోగాన్ని అధారంగా చేసుకుని సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. కానీ, అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు ఉంది ఎంపి ప్రక్రియ రాత పరీక్షను బేస్ చేసుకుని ఉంటుంది. అనంతంరం సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.