KCRకు జైలు శిక్ష పడే వరకు పోరాడాలి.. ఆకునూరి మురళి ఆసక్తికర ట్వీట్

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జెన్ కో ఇంజినీర్ రఘు రాసిన వ్యాసంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ప్రశంసలు కురిపించారు.

Update: 2024-04-10 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జెన్ కో ఇంజినీర్ రఘు రాసిన వ్యాసంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ప్రశంసలు కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఆయన వ్యాసాన్ని షేర్ చేసి కేసీఆర్ కు జైలు శిక్షలు పడేంత వరకు తెలంగాణ ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. ‘ధన్యవాదాలు రఘు ( నిబద్దత కలిగిన తెలంగాణ genco ఇంజనీర్ ) KCR అనే తెలంగాణకు పట్టిన శని రాజకీయ నాయకుడు తన అహంకార మూర్ఖ వ్యవహార శైలితో కట్టిన అవినీతి అబద్దాల కంపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి వివరాలను పరిశోధించి ఇప్పటికి ఆడుతున్న BRS నాయకుల అబద్ధాలను నిజాలతో డీ కొట్టుకుంటూ రాసిన పదునైన చక్కని వ్యాసం. ప్రతి తెలంగాణ వాది చదవాలి. ప్రజలకు విడమర్చి నిజాలను చెప్పాలి. దోషులను (KC రావు, Harishrao, మురళీధర్ రావు సాంకేతిక మంజూరు ఇచ్చిన ఇంజినీర్లను, కాంట్రాక్టర్లను) జైలు శిక్షలు పడేంతవరకు తెలంగాణ ప్రజలు పోరాడాలి’ అని ట్వీట్ చేశారు.


Similar News