దేశంలో జరిగిన అన్ని అగ్ని ప్రమాదాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలా?
సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌కు చుక్కెదురైంది. రెండు నెలల క్రితం తెలంగాణ సచివాలయంలో సంభవించిన అగ్ని ప్రమాద ఘటనపై
దిశ, డైనమిక్ బ్యూరో: సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌కు చుక్కెదురైంది. రెండు నెలల క్రితం తెలంగాణ సచివాలయంలో సంభవించిన అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐతో విచారణ జరపాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సోమవారం పాల్ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. కేఏపాల్ స్వయంగా కేసును వాదించారు.
వాదనల నేపథ్యంలో దేశంలో జరిగిన అగ్ని ప్రమాదాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలా? అని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ దాఖలైందా? అని కూడా ప్రశ్నించింది. ఈ సందర్భంగా తన జీవితానికి ముప్పు ఉందని పాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఒక దానిని, మరొక దానికి ముడిపెట్టొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో, పాల్ పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం డిస్మిస్ చేసింది.
Also Read..