అర్బన్ కంపెనీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.. టీజీపీడబ్ల్యూయూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్

అర్బన్ కంపెనీలోని మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అర్బన్ కంపెనీ మహిళా కార్మికులు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు.

Update: 2023-07-12 16:27 GMT

దిశ , తెలంగాణ బ్యూరో : అర్బన్ కంపెనీలోని మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అర్బన్ కంపెనీ మహిళా కార్మికులు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా టీజీపీడబ్ల్యూయూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. అర్బన్ కంపెనీలో కార్మికులను వివక్ష చుపిస్తున్నారని ఆరోపించారు.

కంపెనీలో చేరినప్పుడు అధిక జీతాలు ఇస్తామని వాగ్దానం చేసి జీతాల్లో కొత్త పెడుతూ దోచుకుంటున్నారని తెలిపారు. కార్మికులను ఏకపక్షంగా తొలగించడంతో ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. అర్బన్ కంపెనీ చేసే మోసాలను అరికట్టాలని.. అధికారులు కంపెనీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News